స్మార్ట్ సిటీ పనులు వేగవంతం కావాలి

TEJA NEWS

స్మార్ట్ సిటీ పనులు వేగవంతం కావాలి

** జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: తిరుపతికి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా మంజూరు కాబడిన పనులు, పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేసేలా వేగం పెంచాలని స్మార్ట్ సిటీ ఛైర్మన్ అండ్ జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 39వ సమావేశాన్ని స్మార్ట్ సిటీ చైర్మన్ అధ్యక్షతన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీలో మంజూరు కాబడిన పనులను, ఇంకను పురోగతిలో ఉన్న 14 పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 6 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నందున వీలైనంత మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కొంత మొత్తము కేటాయించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ డైరెక్టర్లు అయిన సీఈవో అండ్ ఎండి నారపురెడ్డి మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్. రమాశ్రీ, ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top