తల్లికి వందనంతో మహిళల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగింది: ప్రత్తిపాటి

TEJA NEWS

తల్లికి వందనంతో మహిళల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగింది: ప్రత్తిపాటి

  • మీ పిల్లల చదువులకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పడ్డాయా అని నాదెండ్ల మహిళల్ని ప్రశ్నించిన ప్రత్తిపాటి.
  • ఇంట్లో ఎంతమంది ఉంటే అందరు పిల్లలకు చంద్రబాబు డబ్బులు వేశారన్న మహిళలు
  • లోకేశ్ సమర్థవంతంగా పథకం అమలుచేసి ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచారు : ప్రత్తిపాటి.

తల్లికి వందనం పథకంపై మహిళల నుంచి అనూహ్యస్పందన వ్యక్తమవుతోందని… ప్రభుత్వంపై ఆడబిడ్డల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల వెళ్లిన ప్రత్తిపాటి… తల్లికి వందనం పథకం తీరుతెన్నులపై స్థానిక మహిళలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ ప్రభుత్వం డబ్బులు వేసిందంటూ ప్రత్తిపాటి ఎదుట మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం బాగా ఇచ్చిందా… చంద్రబాబు బాగా చేశారా అని ప్రత్తిపాటి అడగ్గా… “జగన్ ఒక్కపిల్లాడికే ఇచ్చాడు…అదీ రెండేళ్లు ఇవ్వలేదు. చంద్రబాబు ఇప్పుడు అందరికీ ఇచ్చాడు“ అని మహిళలు సంతోషంగా సమాధానమిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top