గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీబీ అధ్యక్షులు
వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాలలో నిర్వహించిన గ్రామ దేవతల ఉత్సవాల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తెలంగాణ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, డీసీసీబీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ,లు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మొదటగా పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్ట ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
2.అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కడుకుంట్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దమ్మతల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు
గ్రామస్తులు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు
గ్రామంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసిన ఎమ్మెల్యే గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండలాధ్యక్షుడు రవి కిరణ్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శారద, వైద్యులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్, మణిగిల్ల తిరుపతిరెడ్డి, యాపర్ల రాంరెడ్డి, గుమ్మడం వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
