క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

TEJA NEWS

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

*శారీర‌క‌, మాన‌సిక దృఢ‌త్వానికి ఆట‌లు అవ‌స‌రం
*మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

నిజాంపేట్‌:

క్రీడ‌లు ప్ర‌తీ ఒక్క‌రిలో ఉత్సాహాన్ని పెంచ‌డమే కాకుండా…శారీర‌క‌, మాన‌సికి దృఢ‌త్వానికి ఆట‌లు అవ‌స‌ర‌మ‌ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కోర్ట్ ను కాలనీ వాసులతో కలిసి ఆయ‌న‌ ప్రారభించారు .ఈ సందర్బంగా ధనరాజ్ యాదవ్ మాట్లాడుతూ… క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, కమిటీ సభ్యలు ఫణి రాజు, సురేష్ రెడ్డి, కాలనీ వాసులు, పిల్లలు, యువ‌త‌ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top