యడ్లపాడు జాతీయ రహదారి ప్రక్కన సర్వీసు రోడ్డు సైడ్ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కాలి ఉండటాన్ని జాతీయ రహదారిపై ఉన్న పెట్రోలింగ్ వాహన సిబ్బంది గమనించారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ శివరామకృష్ణ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. ఎక్కడో చంపి ఇక్కడ వేసి కాల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
