Dr. బి.వి. పట్టాభిరామ్ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది

TEJA NEWS

Dr. బి.వి. పట్టాభిరామ్ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది, వారి జీవితం స్ఫూర్తిదాయకం.. లోక్ సత్తా పార్టీ..

ఒకప్పుడు అందరిలా నేను క్రికెట్ ను అభిమానించేవాడిని, టీవీలో వీక్షించే వాడిని. అంతే కాకుండా అన్ని ప్రధాన పత్రికల్లో క్రికెట్ వార్తను విధిగా చదివేవాడిని.
ఓ ఆదివారం “వార్త” పత్రికలో సండే స్పెషల్ బుక్ లో డాక్టర్ పట్టాభి క్రికెట్ ను గురించి వ్రాసిన ప్రత్యేక వ్యాసం నన్ను ఆలోచింపజేసింది.
డాక్టర్ పట్టాభి క్రికెట్ ను గురించి తాను రచించిన వ్యాసంలో వ్రాస్తూ క్రీడలు అంటే క్రికెట్ మాత్రమే కాదు అని, అనేక క్రీడా విభాగాలలో క్రికెట్ అనేది కూడా ఒక క్రీడ మాత్రమే అని అందుకోసం విద్యార్థులు చదువు మానేసి, ఉద్యోగస్తులు ఉద్యోగానికి సెలవు పెట్టి, వివిధ పనులు చేసుకునే వాళ్ళు వాటిని ప్రక్కన పెట్టి, క్రికెట్ ను వీక్షించడం దేశభక్తిగా కొందరు భావిస్తున్నారని అది సరి అయింది కాదు అని చాలా అద్భుతంగా వివరించారు.
అదే వ్యాసంలో నిజమైన దేశభక్తి గురించి చెబుతూ, “కార్గిల్ యుద్ధం”లో జరిగిన ఒక ముఖ్య సంఘటన గూర్చి గుండెకు హత్తుకునేలాగా వ్రాశారు.

You cannot copy content of this page

Scroll to Top