ఉత్సాహంగా ముగిసిన నిహాన్ షోటోకన్ జాతీయ స్థాయి కరాటే పోటీలు
శంకర్పల్లికి చెందిన అనిల్ టీం రీత్విక్ రాజ్ గైక్వాడ్ గెలుపు
శంకర్పల్లి: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 14, 15 తేదీలలో ‘నిహాన్ షోటోకన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలను “హన్సి వి. రవీందర్ కుమార్,” “షిహాన్ ఈ. శ్రీనివాసులు” సంయుక్తంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా సుమారు 1200 మంది కరాటే క్రీడాకారులు పాల్గొని కటా, కుమిటి విభాగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ప్రారంభోత్సవానికి “జి7 ఛానల్ చైర్మన్ గణేష్,” “ఈ వింగ్స్ డైరెక్టర్ రామకృష్ణ.” “లక్ష్యసాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞ రాజు” తదితరులు హాజరయ్యారు. అలాగే కియో ఆర్గనైజేషన్ రెఫరీలు విజయ్, సయ్యద్ అక్బర్ అలీ, కనకరాజు, రాష్ట్ర బాధ్యులు వి.
నరేందర్, సి. హెచ్ సాయికుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఫస్ట్ బెస్ట్ టీం కప్ ను ‘హైదరాబాద్ శంకర్పల్లికి చెందిన అనిల్ టీం గెలుచుకోగా రీత్విక్ రాజ్ గైక్వాడ్, రెండవ టీం కప్ ను విఎన్ఆర్ కరాటే అకాడమీకి చెందిన నరేందర్ టీం, మూడవ టీం కప్ ను అశోక చక్రవర్తి టీం దక్కించుకుంది. విజేతలకు కప్పులు, మెడల్స్, మెమెంటోలు అందజేశారు. పాయింట్ల ఆధారంగా 217 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానం, 116 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం, 76 పాయింట్లతో మూడవ స్థానం సాధించాయి. ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగి విజయవంతంగా ముగిశాయి.
