చిలకలూరిపేటలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ

TEJA NEWS

చిలకలూరిపేటలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంటిలో జరిగిన చోరీ సంఘటన ఆ ప్రాంత వాసులను బెంబేలెత్తుస్తుంది. బాధితుడు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి తాళాలు వేసి రాత్రి అవనిగడ్డ కు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు, తలుపులు పగలకొట్టి ఇల్లు మొత్తం చిందర వందరగా ఉండటంతో షాక్ అయ్యామని అన్నారు. అయితే ఇంటిలో ఉన్న సుమారు 2.75 లక్షల నగదు, సుమారు 70గ్రాముల బంగారం, 3 కేజీల వెండి మరియు సుమారు 40 వరకు పట్టు చీరలు చోరీ అయినట్లు ఆయన తెలిపారు. దీనితో వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top