జిల్లాలో ఆహార నాణ్యత పై ఫుడ్ సేఫ్టీ అధికారి ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలి

TEJA NEWS

జిల్లాలో ఆహార నాణ్యత పై ఫుడ్ సేఫ్టీ అధికారి ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలి
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్ లతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాలయాల్లో ఆహార నియమాలను సేకరించి నివేదిక ఇవ్వాలి
గృహవసరాల ఎల్.పి.జి. సిలిండర్లకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేవు .. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దు – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్ లతో పాటు అన్ని విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత పై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, తరచుగా ఆహార నమునాలను సేకరించి నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కరుణాకర్ ను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి హాల్లో జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యత, సిలిండర్ల సరఫరా పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
రానున్న వర్షాకాలం సీజన్లో విద్యార్థులు, ప్రజలు రోగాల బారిన పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, పాఠశాలల్లో ఆహార నిల్వలు, వండిన ఆహార పదార్థాలు నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి ల్యాబ్ కు పంపించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్ లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాల నమూనాలు తరచుగా సేకరించి నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలని సూచించారు. ఆహార పదార్థాలు సిద్ధం చేసే అన్ని అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ లు FSSAI లొ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. దీనికొరకు FOSCOS వెబ్సైట్ కి లాగిన్ అయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు.
సిలిండర్ గ్యాస్ ల పై సమీక్ష నిర్వహిస్తూ పశ్చిమాసియాలో జరుగుచున్న యుద్ధాల వల్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రభుత్వ ముందస్తు చొరవ వల్ల గృహావసరాలకు వాడే సిలిండర్ గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, కేవలం వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొంత కోత ఉన్నట్లు తెలిపారు. గృహావసరాలకు ఒకసారి సిలిండర్ తీసుకున్నాక పట్టణ ప్రాంతంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతంలో అయితే 45 రోజుల తర్వాత తిరిగి బుక్ చేసుకోవచ్చని, ప్రజలు అనవసర ఆందోళనతో ఒక్కసారిగా అవసరం లేకున్న బుక్ చేసుకుంటూ ఇబ్బందులు పడవద్దని తెలియజేశారు.
అన్ని విద్యాలయాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, ఆసుపత్రులకు గ్యాస్ సిలిండర్ సమస్యలు లేకుండా సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జడ్పీ సి ఈ ఓ యాదయ్య, జిల్లా సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కరుణాకర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top