డి ఆర్ ఎన్ ఎస్ సి వి ఎస్ కళాశాలలో యోగా శిక్షణ శిబిరం
చిలకలూరిపేట : స్థానిక డి ఆర్ ఎన్ ఎస్ సి వి ఎస్ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల మైదానంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు చుక్క విన్సెంట్ పాల్ నిర్వహించారు. యోగ ప్రాముఖ్యతను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైర సుజాత మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులకు తెలియజేశారు
